IBPS RRB clerk Exam Results | ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

IBPS RRB clerk Exam Results | ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌-2025 (ఆఫీస్‌ అసిస్టెంట్‌) ప్రిలిమ్స్‌ ఫలితాలు (IBPS RRB Clerk Prelims 2025 Result) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated : 23 Jan 2026 15:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌-2025 (ఆఫీస్‌ అసిస్టెంట్‌) ప్రిలిమ్స్‌ ఫలితాలు (IBPS RRB Clerk Prelims 2025 Result) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.ibps.in/లోకి వెళ్లి తమ రిజిస్ట్రేషన్‌ / రోల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌/పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను పొందొచ్చు. 

స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

డిసెంబర్‌ 6, 7, 13, 14 తేదీల్లో ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ స్కోర్‌ కార్డులను జనవరి 29వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అలాగే, ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 1న జరగనున్న మెయిన్స్‌ పరీక్ష రాయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.