JEE Main 2026 final key | జేఈఈ మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ.. 9 ప్రశ్నలు డ్రాప్!
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది.
By Education News Team
Updated :16 Feb 2026 15:10 IST
https://results.eenadu.net/education-news/9-questions-dropped-in-jee-main-2026-final-key
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్ష ఫలితాల (JEE Main 2026 Results) విడుదలకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన అధికారులు.. మరికాసేపట్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికే జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఫిబ్రవరి 16లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని వెల్లడించిన అధికారులు.. తాజాగా ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తుది కీలో మొత్తంగా 9 ప్రశ్నలను డ్రాప్ చేశారు. వీటిలో ఏడు ప్రశ్నలు ఒక్క ఫిజిక్స్ నుంచే ఉండటం గమనార్హం. మిగతా రెండు ప్రశ్నలూ మ్యాథమెటిక్స్ నుంచి ఉన్నాయి. దేశంలోని వివిధ పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని వేర్వేరుగా ఒకే డాక్యుమెంట్‌లో విడుదల చేశారు.
ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి
సబ్జెక్టు, షిఫ్ట్‌ల వారీగా డ్రాప్ చేసిన ప్రశ్నల ఐడీలు ఇవే..
- జనవరి 22 - షిఫ్ట్ 2 పరీక్ష - ఫిజిక్స్ - 444792191
- జనవరి 22 - షిఫ్ట్-2 మ్యాథ్స్- 860654995
- జనవరి 22- షిఫ్ట్-2 - ఫిజిక్స్ - 8606541010
- జనవరి 22- షిఫ్ట్-2 - ఫిజిక్స్ - 8606541017
- జనవరి 23- షిఫ్ట్-1 - ఫిజిక్స్ - 8606541395
- జనవరి 23- షిఫ్ట్-2- ఫిజిక్స్- 444792476
- జనవరి 23 - షిఫ్ట్-2 - ఫిజిక్స్ - 444792479
- జనవరి 24- షిఫ్ట్-2- ఫిజిక్స్ - 444792647
- జనవరి 28- షిఫ్ట్-2- మ్యాథ్స్ - 444792698
ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.in, ఎన్‌టీఏ వెబ్‌సైట్ nta.ac.inలలో చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందొచ్చు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ తొలివిడత (పేపర్ 1) పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... ఈ పరీక్షకు దాదాపు 95 శాతం మంది హాజరైనట్లు అంచనా. ఫిబ్రవరి 4న ప్రొవిజినల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఈనెల 6 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తాజాగా తుది కీని అందుబాటులోకి తీసుకొచ్చారు.