NEET UG 2025 Registrations | నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు ఇలా..!

NEET UG 2025 Registrations | నీట్‌ (యూజీ) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. దరఖాస్తులు ఇలా..!

నీట్‌ యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు మార్చి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Eenadu icon
By Education News Team Published :07 Feb 2024 21:29 IST

NEET UG 2025 Registration | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ - యూజీ (NEET UG 2025) పరీక్షకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. మే 4న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA).. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్‌ విధానంలో ఒకే షిఫ్టులో ఈ పరీక్ష జరగనుంది.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు.. 

  • దరఖాస్తులు: ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 రాత్రి 11.50 గంటల వరకు
  • దరఖాస్తులో పొరపాట్ల సవరణ: మార్చి 9 నుంచి 11వరకు
  • దరఖాస్తు రుసుం: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.1700; జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులకు రూ.1600; ఎస్సీ, ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.1000; విదేశీ విద్యార్థులు రూ.9500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 
  • సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు ఏప్రిల్‌ 26 నాటికి; అడ్మిట్‌ కార్డులను మే 1 నాటికి విడుదల చేస్తారు. 
  • నీట్‌ పరీక్ష తేదీ: మే 4 (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు)
  • ఫలితాలు జూన్‌ 14 నాటికి విడుదల చేసే అవకాశం. సమాచార బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి.

 దరఖాస్తు ఇలా..

  • తొలుత neet.nta.nic.in వెబ్‌సైట్‌ సందర్శించాలి.
  • రిజిస్ట్రేషస్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • చెల్లుబాటయ్యేలా మీ వ్యక్తిగత సమాచారంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • లాగిన్‌ అయ్యి అప్లికేషన్‌ ఫారం పూర్తి చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయాలి.
  • మీరు ఎంటర్‌ చేసిన సమాచారాన్ని జాగ్రత్తగా సరిచూసుకొని.. ఏవైనా మార్పులు ఉంటే చేయండి.
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి సబ్‌మిట్‌ చేయాలి.
  • మీరు దరఖాస్తు చేసినట్లుగా వచ్చిన కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకొని భద్రపరుచుకోండి.