UGC NET Results | యూజీసీ-నెట్ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
యూజీసీ - నెట్ (డిసెంబర్ 2025) పరీక్ష ఫలితాలు (UGC NET December 2025 Results) విడుదలయ్యాయి.
By Education News Team
Published : 04 Feb 2026 22:10 IST
https://results.eenadu.net/education-news/UGC-NET-Exam-Results-out
ఇంటర్నెట్ డెస్క్: యూజీసీ - నెట్ (డిసెంబర్ 2025) పరీక్ష ఫలితాలు (UGC NET December 2025 Results) విడుదలయ్యాయి. డిసెంబర్ 31 నుంచి జనవరి 7వరకు ఈ పరీక్ష జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫైనల్ కీ, ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 9,93,702 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. 7,35,614మంది హాజరయ్యారు. వీరిలో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 5,108 మంది; అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్లకు 54,713మంది; కేవలం పీహెచ్‌డీకి మాత్రమే 1,17,058 మంది చొప్పున క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అర్హత కోసం ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే డిసెంబర్‌కు సంబంధించి 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.