TG ECET 2026 | తెలంగాణ ఈసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఈసెట్ (TG ECET 2026)కు షెడ్యూల్ విడులైంది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By Education News Team
Updated : 04 Feb 2026 19:05 IST
https://results.eenadu.net/education-news/TG-ECET-2026-Schedule-released
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఈసెట్ (TG ECET 2026)కు షెడ్యూల్ విడులైంది. ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 18 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఈసెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 15న నిర్వహించనున్నారు. ఈసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2026-2027 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.