JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ ప్రొవిజినల్‌ కీ విడుదల

JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ ప్రొవిజినల్‌ కీ విడుదల

జేఈఈ మెయిన్‌ 2026 (సెషన్-1) పరీక్ష ప్రొవిజినల్‌ కీ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Updated :04 Feb 2026 14:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ 2026 (సెషన్-1) ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ (JEE Main 2026 Provisional key) విడుదలైంది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు JEE Main పరీక్షలు జరగ్గా.. పేపర్‌ -1కు సంబంధించిన ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్లను ఎన్‌టీఏ (NTA) అధికారులు బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కీపై నేటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 11.50గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్‌ కీ కోసం క్లిక్‌ చేయండి

ఈ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున (నాన్‌ రిఫండ్‌) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన అనంతరం తుది కీ విడుదల చేసి ఫిబ్రవరి 12 నాటికి ఫలితాలు ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1 పరీక్షను దేశవ్యాప్తంగా దాదాపు 13లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.