IIT Madras | ఐఐటీ మద్రాస్ ‘సమ్మర్ ఫెలోషిప్’ ప్రోగ్రామ్.. స్టైపెండ్ ఎంతో తెలుసా?
రాబోయే వేసవి కాలంలో తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకొనే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ (IIT Madras) గుడ్‌న్యూస్ చెప్పింది.
By Education News Team
Updated :02 Feb 2026 14:58 IST
https://results.eenadu.net/education-news/IIT-Madras-Summer-Fellowship-Programme-2026
చెన్నై: రాబోయే వేసవి కాలంలో తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకొనే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ (IIT Madras) గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవిలో చేపట్టనున్న ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం ఔత్సాహిక విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు తమ వెబ్‌సైట్‌లో మార్చి 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని IIT-M తెలిపింది. రెండు మాసాల పాటు జరిగే ఈ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ మే 18న ప్రారంభమై జులై 17తో ముగియనుంది.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
స్టైపెండ్ ఎంతంటే?
ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్ లేదా హ్యుమానిటీస్ రంగాల్లో నాణ్యతతో కూడిన విద్యా పరిశోధనపై విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ అందిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.15వేలు చొప్పున స్టైపెండ్‌గా ఇస్తారు. ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు అనర్హులు. (IIT Madras Summer Fellowship Programme)
అర్హులు ఎవరు?
బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో మూడు/ నాలుగో సంవత్సరం చదువుతున్నవారితో పాటు మంచి అకడమిక్ రికార్డు కలిగిన ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఏయే డాక్యుమెంట్‌లు కావాలి?
- పాస్‌పోర్టు సైజు ఫొటో; కేటగిరీ సర్టిఫికెట్; ఆధార్ కార్డు; మీరు తమ వద్ద చదువుతున్నట్టు ధ్రువీకరిస్తూ సంబంధిత విద్యాసంస్థ అధిపతి జారీ చేసే సర్టిఫికెట్
- పదో తరగతి, ఇంటర్/పాలిటెక్నిక్ నుంచి మొదలుకొని ఇటీవల పూర్తి చేసిన సెమిస్టర్ వరకు.. అన్ని సెమిస్టర్ల మార్క్‌షీట్‌లను పీడీఎఫ్ రూపంలో అందించాల్సి ఉంటుంది.
హాస్టల్ వసతి ఉందా?
- ఈ రెండు నెలల కాలానికి లభ్యతను బట్టి హాస్టల్, మెస్ సదుపాయం కూడా ఉంటుంది. కాకపోతే, దీనికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఫెలోషిప్‌లో పాల్గొనే ఇంజినీరింగ్ విభాగాలివే..
- ఏరోస్పేస్ ఇంజినీరింగ్
- అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయో మెడికల్ ఇంజినీరింగ్
- బయో టెక్నాలజీ
- కెమికల్ ఇంజినీరింగ్
- సివిల్ ఇంజినీరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
- డేటా సైన్స్ అండ్ ఏఐ
- ఇంజినీరింగ్ డిజైన్
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- మెకానికల్ ఇంజినీరింగ్
- మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- మెటలార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్
- ఓషన్ ఇంజినీరింగ్
సైన్స్ విభాగంలో
- పిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
మేనేజ్‌మెంట్ స్టడీస్