TGPSC Hostel welfare officer Results | తెలంగాణలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఎంపిక జాబితా విడుదల
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :17 Mar 2025 18:07 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17032025-tgpsc-hostel-welfare-officer-results
హైదరాబాద్: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతిగృహాల్లో 581 సంక్షేమ వసతి గృహాల అధికారుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం వెల్లడించింది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు (సీబీఆర్‌టీ) నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తంగా 1,45,359మంది దరఖాస్తు చేసుకోగా.. 82వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా కోసం క్లిక్ చేయండి
మొత్తం 581 పోస్టులకు గాను 574మందిని ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రొవిజినల్ సెలెక్షన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీరిలో 561మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, లేడీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపిక కాగా.. 13మంది వార్డెన్, మాట్రన్ గ్రేడ్ 1, గ్రేడ్-2 పోస్టులకు ఎంపికయ్యారని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్/నిబంధనలకు అనుగుణంగా ఎంక్వైరీ సహా తదుపరి ప్రక్రియలను పూర్తి చేసి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.