Telangana TET Results | తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్
        
        తెలంగాణ టెట్ ఫలితాలు, తుది కీని విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.
     
    
    
   
    
    
      By Education News Team
      Published :05 Feb 2025 18:05 IST
      
    
     
        
            
            
            
                
                
                
                    https://results.eenadu.net/news.aspx?newsid=05022025
                    
                 
             
            
            
            
         
        
     
    
    TET Results | ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (Telangana TET Results)విడుదలయ్యాయి.  జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. జనవరి 27వరకు అభ్యంతరాలు స్వీకరించి తాజాగా తుది కీ, ఫలితాలను ప్రకటించారు. టెట్ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,05,278 మంది పరీక్ష రాశారు. రెండు పేపర్లలో సగటున 40.78 శాతం మంది కనీస మార్కులు సాధించి ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 
టెట్ ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి