GATE 2026 Admit Cards | గేట్‌ అడ్మిట్‌ కార్డులపై అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌

GATE 2026 Admit Cards | గేట్‌ అడ్మిట్‌ కార్డులపై అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక.

Eenadu icon
By Education News Team Updated :01 Jan 2026 21:40 IST

GATE 2026| ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డుల విడుదల వాయిదా పడింది. తొలుత జనవరి 2న గేట్‌ అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని ప్రకటించిన ఐఐటీ గువాహటి(IIT Guwahati).. తాజాగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. విడుదల చేసే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

గేట్‌ మాక్‌ టెస్టుల కోసం క్లిక్ చేయండి

దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం గేట్‌ పరీక్ష ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మరోవైపు, గేట్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టెస్ట్‌పేపర్లు/ సిలబస్‌తో పాటు మాక్‌ టెస్టులు, గత 18 ఏళ్లకు సంబంధించిన పాత క్వశ్చన్‌ పేపర్లనూ అధికారిక వెబ్‌సైట్‌లో పొందొచ్చు.